చొప్పదండి సహకార సంఘానికి ఉత్తమ ప్యాక్స్ అవార్డు ప్రకటిస్తూ సోమవారం నాబార్డ్ ఉత్తర్యులు జారీ చేసింది. నాబార్డ్ 44వ వార్షికోత్సవం సందర్బంగా ఈ అవార్డు ప్రకటించగా సొసైటీ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, సిఈఓ కళ్లెం తిరుపతి రెడ్డి హర్ష్యం వ్యక్తం చేశారు. రైతులకు అన్ని రకాల సేవలు, రుణాలు రికవరీ వల్ల బెస్ట్ సోసైటీ అవార్డు వచ్చిందని కేడీసీసీ సీఈఓ సత్యనారాయణ అభినందించారు.