కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో భూ భారతి పథకం కింద రీసర్వే ప్రక్రియ ప్రారంభమైంది. తహసీల్దార్ పి. నవీన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, భూ వివాదాలను నివారించి, డిజిటల్ పట్టాలు అందించడానికి ఈ సర్వే దోహదపడుతుందని తెలిపారు. అధునాతన సాంకేతికతతో భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లను కొలిచి, డిజిటల్ మ్యాపులను రూపొందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేణుగోపాల్, సర్వేయర్ బి. శ్రీనివాస్, గిర్దావర్ టి. త్రిపాల్సింగ్ పాల్గొన్నారు.