ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఐఎండీ
Mar 30, 2026, 05:03 IST/

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఐఎండీ

Mar 30, 2026, 05:03 IST
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. సోమవారం భారీ వర్షంతో పాటు వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లలో వడగళ్ల వానలు, తుఫానులు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ భారత్‌లోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో కూడా ఈ వారమంతా చెదురుమదురుగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.