చొప్పదండిలో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

8చూసినవారు
చొప్పదండిలో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
కరీంనగర్ జిల్లా, చొప్పదండిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సోమవారం నిర్వహించారు. ఈనెల 17వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్