కరీంనగర్ జిల్లా రామడుగులో రూ. 4.14 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తమ్ముడు మామిడి నరేష్ సొంత అన్న వెంకటేష్ ను టిప్పర్తో హత్య చేసి, ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు నరేష్ తో సహా ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు.