చొప్పదండి: క్యాబినెట్ నిర్ణయం పట్ల సంబరాలు

53చూసినవారు
చొప్పదండి: క్యాబినెట్ నిర్ణయం పట్ల సంబరాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల చొప్పదండిలో శనివారం సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు గుంటి స్వరూపాశ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్