కరీంనగర్ జిల్లా, చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 8 కేంద్రాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చైర్ పర్సన్ వడ్లూరి సరితా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చుక్కలు వేసి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కీర్తన, కమిషనర్ నాగరాజు, ఏ ఎం సి చైర్మన్ కొత్తూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.