చొప్పదండిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

2చూసినవారు
చొప్పదండిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
చొప్పదండి మండలంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను రజక సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు మావురపు రాములు, యువజన సంఘం అధ్యక్షుడు నిజానపురం చందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన సేవలను, భూమి కోసం సాగించిన పోరాటాన్ని నాయకులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్