కరీంనగర్ జిల్లా, చొప్పదండి మున్సిపల్ లో శనివారం జరిగిన సాధారణ సమావేశంలో బతుకమ్మ సంబరాల నిర్వహణ కొరకు నిధులు కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. దీంతోపాటు పారిశుద్ధ్య పనుల మెరుగుదలకు, దోమల వ్యాప్తి నివారణ నిమిత్తం అన్ని వార్డులలో ఫాగింగ్, గడ్డి మందు స్ప్రే చేయుటకు కూడా తీర్మానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస, కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.