చొప్పదండి: మృతుని కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

5చూసినవారు
చొప్పదండి: మృతుని కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
చొప్పదండి మండలం చాకుంటలో మాజీ ఎంపీటీసీ గోపు నరేందర్ రెడ్డి మంగళవారం పిడుగుపాటుకు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను స్థానిక బిఆర్ఎస్ నేతలతో కలిసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నరేందర్ రెడ్డి అకాల మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని, పిడుగుపాటుతో నరేందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని సుంకె పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్