చొప్పదండి: మున్సిపల్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

759చూసినవారు
చొప్పదండి: మున్సిపల్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్పర్సన్ వడ్లూరి సరిత బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ మంత్రి లక్ష్మణ్ బాపూజీ నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్