రాగంపేట లో పిడుగు పాటుతో ఆవు మృతి

1054చూసినవారు
రాగంపేట లో పిడుగు పాటుతో ఆవు మృతి
కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండల పరిధిలోని రాగంపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కోమల్ల కనకయ్యకు చెందిన ఆవు పిడుగుపాటుతో మృతి చెందింది. రెండు రోజుల్లో పురుడు పోసుకోవాల్సిన ఆవు అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఖరీదైన ఆవు మృతి పట్ల గ్రామస్తులు కనకయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్