బోయినపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన ఉపకరణాలను అందించేందుకు ఒక క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అవసరమైన ఉపకరణాల కోసం దివ్యాంగులు, వృద్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మండలంలోని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.