చొప్పదండి మండలం రుక్మాపూర్ లో సర్వేనెంబర్ 18 పరిధిలోని 4 ఎకరాల నివాస స్థలాలను రెవెన్యూ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండా వక్ఫ్ బోర్డు ఖాతాలో నమోదు చేశారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రుక్మాపూర్ లో బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. సర్వేనెంబర్ 18ని తక్షణమే వక్ఫ్ బోర్డు రికార్డుల నుంచి తొలగించి బాధితుల పేర్లపై హక్కులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.