పిట్టలపల్లి గ్రామ శివారులో డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు

11చూసినవారు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, గంగాధర మండల పోలీసులు పిట్టలపల్లి గ్రామ శివారులో డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు లేదా ఇతర అక్రమ సామగ్రి తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు నిఘా పెట్టారు. రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని పోలీసులు సూచించారు. ఈ తనిఖీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండేలా చూడటానికేనని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్