పొలంలో కాలుజారి కిందపడి రైతు మృతి

0చూసినవారు
పొలంలో కాలుజారి కిందపడి రైతు మృతి
గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామంలో సరిపెల్లి నరసయ్య (70) అనే వృద్ధ రైతు పొలంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందాడు. తన పొలం వద్ద ఉన్న బర్రెను తీసుకురావడానికి పొలం గట్టు మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తల బురదలో కూరుకుపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్