ఉచిత కోచింగ్ ట్యూషన్ గ్రామంలో ప్రారంభించిన.. కన్నం సుదర్శన్

3చూసినవారు
ఉచిత కోచింగ్ ట్యూషన్ గ్రామంలో ప్రారంభించిన.. కన్నం సుదర్శన్
బోయినపల్లి మండలంలోని అనంతపల్లి గ్రామానికి చెందిన వాగేశ్వరి కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్నం సుదర్శన్, తన సొంత ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ఆదివారం ఉచిత కోచింగ్, ట్యూషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌లో గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించి శిక్షణ ఇస్తారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుదర్శన్ కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి పంపించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్