సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యేకు గౌడ్ సంఘం వినతి

10చూసినవారు
సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యేకు గౌడ్ సంఘం వినతి
చొప్పదండి పట్టణంలోని ఇప్పనపల్లి హరికిషన్ హైస్కూల్ గేట్ ఎదురుగా తెలంగాణ వీరయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోరుతూ గౌడ్ సంఘం నాయకులు బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం అందజేశారు. సర్వాయి పాపన్న త్యాగం, పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని, భవిష్యత్ తరాలకు ఆయన చరిత్ర తెలియజేయడం ఆవశ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం అధ్యక్షులు బుర్ర మల్లేశం గౌడ్, యూత్ అధ్యక్షులు బొడిగే సాయి గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్