
విద్యుత్ షాక్తో తండ్రి, కుమార్తె మృతి
TG: సికింద్రాబాద్ అల్వాల్లో శుక్రవారం భారీ వర్షం కారణంగా రోడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి తండ్రి సందీప్, కుమార్తె రితిక మృతి చెందారు. వర్షానికి విరిగిపడిన చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భార్య శ్వేతకు స్వల్ప గాయాలయ్యాయి.




