రుక్మాపూర్ వక్ఫ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

719చూసినవారు
రుక్మాపూర్ వక్ఫ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
చొప్పదండి మండలం రుక్మాపూర్లో సర్వే నెంబర్ 18లోని 4 ఎకరాల నివాస స్థలాలను అక్రమంగా వర్ఫ్ బోర్డు ఖాతాలో నమోదు చేయడాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. 60 ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న దళిత, బహుజన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్ఫ్ రికార్డుల నుండి ఈ భూములను తక్షణమే తొలగించి, బాధితులకు హక్కులు కల్పించాలని ఆయన కోరారు. బీజేపీ మండల అధ్యక్షులు మొగిలి మహేష్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్