బోయినపల్లి మండలంలోని తడగొండ గ్రామంలో వివో మహిళా సంఘ భవనానికి సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేష్, పిఆర్ డిఈ విష్ణువర్ధన్, పిఆర్ ఏఈ సాయి తేజ ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో, మహిళలు ఆర్థికంగా, వ్యాపారపరంగా ముందంజలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వివో భవనానికి ఈజీఎస్ కింద 10 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.