శివాజీ విగ్రహం ఏర్పాటుకు ఐకాస వినతి

802చూసినవారు
శివాజీ విగ్రహం ఏర్పాటుకు ఐకాస వినతి
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో గుమ్లాపూర్ X రోడ్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ వడ్లురి సరిత, కమిషనర్ నాగరాజు, పాలకవర్గ సభ్యులకు శనివారం వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని వివిధ వార్డు ప్రజలు, కుల, యూత్, మహిళా సంఘాల తీర్మాణాలతో కూడిన ఈ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం ఇంద్రసేనారెడ్డి, పడకంటి కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్