బోయినపల్లి మండలం నిలోజిపల్లి బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ ఆనుముల భాస్కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి నియోజకవర్గం గుమలాపూర్ కు వస్తున్న సందర్భంగా మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలకు ఐదు లక్షల 4 వేల రూపాయలు ఇస్తారని ఆశించారు. అయితే, ముంపు గ్రామాల సమస్యలపై సీఎం మాట్లాడకపోవడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం 5 లక్షల 4 వేలు ఇప్పిస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు ముంపు గ్రామాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా మిడ్ మానేరు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఇప్పటికైనా సీఎం మిడ్ మానేరు సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.