జ్ఞాన సరస్వతి ఆలయ వార్షికోత్సవం: పట్టణంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు

18చూసినవారు
జ్ఞాన సరస్వతి ఆలయ వార్షికోత్సవం: పట్టణంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు
చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయ తృతీయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా, హనుమాన్ దేవాలయం మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన వైభవంగా సాగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.

సంబంధిత పోస్ట్