బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. బుధవారం ఉదయం అమ్మవారికి అభిషేకం, మంగళ హారతి పూజ నిర్వహించి, మొక్కలు తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మాసంలో ప్రతి ఇంటిలో పౌర్ణమి రోజు తులసి ఉసిరి మొక్కను పెట్టి కళ్యాణం నిర్వహించి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తిక మాసం లో దీనిని ప్రీతికరమైన పవిత్రమైన రోజుగా కొనియాడుతారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.