చొప్పదండి మార్కెట్ చైర్మన్ గా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ?

11చూసినవారు
చొప్పదండి మార్కెట్ చైర్మన్ గా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ?
ప్రతిష్టాత్మకమైన చొప్పదండి మార్కెట్ చైర్మన్ పదవికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ పటిష్టతకు అంకితభావంతో కృషి చేస్తూ పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుడని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇంకా ఈ చైర్మన్ పదవి రేసులో చొప్పదండి గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు పెరుమాండ్ల గంగయ్య, రుక్మాపూర్ మాజీ ఎంపీటీసీ ముద్దసాని రంగన్న, మాజీ వైస్ ఎంపీపీ మునిగాల చందు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్