
నెతన్యాహుపై ఇజ్రాయెల్ ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇలాంటి ఒప్పందం చూడలేదని, ఇది అతిపెద్ద రాజకీయ విపత్తు అని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సొంత నిర్ణయాల వల్లే ఈ దుస్థితి వచ్చిందని, జాతి భద్రతకు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతిపక్షాలను సంప్రదించలేదని ప్రతిపక్ష నేత లాపిడ్ విమర్శించారు.




