కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం ఉదయం పొలంలో పులి పాదాలను గుర్తించిన రైతు ముద్దసాని శ్రీనివాస్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు గ్రామానికి చేరుకొని పాదాలను పరిశీలించి, అవి పులివేనని నిర్ధారించారు. గ్రామస్తులను, రైతులకు రాత్రి వేళల్లో లేదా ఉదయం 7 గంటలలోపు పొలాలకు వెళ్లవద్దని, పులి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.