కరీంనగర్ జిల్లా, చొప్పదండికి చెందిన మడ్డి మనోజ్ కుమార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా 2026లో ఆసరా ప్రాణదాత జిల్లా స్థాయి అవార్డు శనివారం అందుకున్నారు. కరీంనగర్ జిల్లా ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపోలు గోపికృష్ణ, మనోజ్ కుమార్ చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డును ప్రధానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.