చొప్పదండిలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడల ఎంపిక పోటీలు
చొప్పదండిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) మైదానంలో ఈనెల 10, 11 తేదీలలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని మండల ఎస్జీఎఫ్ చైర్మన్, మండల విద్యాధికారి కే. జ్యోతి తెలిపారు. బుధవారం మండల విద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్జీఎఫ్ మండల సెక్రటరీ కే. కృష్ణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీలు క్రీడాకారుల ఎంపిక కోసం ఉద్దేశించబడ్డాయి.