కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర మైదానంలో సెప్టెంబర్ 10, 11 తేదీలలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు జరుగుతాయని మండల ఎస్జీఎఫ్ చైర్మన్, విద్యాధికారి కె. జ్యోతి తెలిపారు. 10న బాలికలకు, 11న బాలురకు వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో క్రీడల్లో అండర్-14, అండర్-17 విభాగాల్లో ఎంపికలుంటాయని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల
విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఎస్జిఎఫ్ సెక్రటరీ కృష్ణ, పీడీ లు పాల్గొన్నారు.