బోయినపల్లి మండలంలో మిడ్ డే మీల్స్ కార్మికులు ధర్నా నిర్వహించి, ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. కోడిగుడ్ల ధర, గ్యాస్ సిలిండర్ల సరఫరా, కార్మికుల జీతాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్, గ్రాట్యుటీ వంటి అంశాలపై వారు డిమాండ్లు చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. గత 24 ఏళ్లుగా తమ శ్రమ దోపిడీకి గురవుతున్నామని కార్మికులు ఆరోపించారు.