ఫిబ్రవరి 5వ తేదీన చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆయనతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సందర్భంగా సమీక్షించారు.