బోయినపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించని 177 మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసినట్లు ఎంపీడీవో భీమ జయశిల తెలిపారు. అనంతపల్లిలో 42, మండలంలోని ఇతర గ్రామాల్లో 135 ఇళ్లకు ఈ చర్య తీసుకున్నారు. అధికారులు లబ్ధిదారులకు పలుమార్లు అవగాహన కల్పించినా, నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.