మున్సిపల్ చైర్ పర్సన్ చేతుల మీదుగా డ్రైనేజీ పనుల ప్రారంభం

11చూసినవారు
మున్సిపల్ చైర్ పర్సన్ చేతుల మీదుగా డ్రైనేజీ పనుల ప్రారంభం
కరీంనగర్ జిల్లా, చొప్పదండిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత తెలిపారు. శనివారం పట్టణంలోని 8వ వార్డ్ లో డ్రైనేజీ పనులను ఆమె ప్రారంభించారు. ఈ నిర్మాణంతో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు పరిసరాల పరిశుభ్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ రాజన్నల రాజు, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్