చొప్పదండిలో పండిట్ దీన్ దయాల్ జయంతి ఘనంగా

4చూసినవారు
చొప్పదండిలో పండిట్ దీన్ దయాల్ జయంతి ఘనంగా
కరీంనగర్ జిల్లా, చొప్పదండి పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారని, బిజెపికి పటిష్ట పునాదులు వేసింది దీన్ దయాలేనని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు శ్రవణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్