
ఎలక్ట్రిక్ బైక్ల సబ్సిడీని పొడిగించిన కేంద్రం
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద, ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీలను జులై 31 వరకు పొడిగించినట్లు కేంద్రం ప్రకటించింది. అక్టోబర్ 1, 2024న ప్రారంభమైన ఈ పథకం కింద, లక్ష్యాన్ని మించి ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీవీలర్లు, ఇ-రిక్షాలు, ఇ-కార్టులు విక్రయించబడ్డాయి. ఇందుకోసం రూ.1772 కోట్లు కేటాయించగా, రూ.1,259.91 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ఇ-రిక్షా, ఇ-కార్టుల విభాగంలో ఆశించిన అమ్మకాలు జరగనందున, నిధుల కేటాయింపును తగ్గించారు. ఇ-రిక్షా, ఇ-కార్టుల సబ్సిడీలను మార్చి 31, 2028 వరకు పొడిగించారు.




