కోతులతో ఇబ్బందులు.. వినూత్నంగా ఆలోచన

2చూసినవారు
గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామస్థులు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి చొరబడి ఆస్తులకు నష్టం కలిగిస్తున్న కోతులను తరిమికొట్టేందుకు గ్రామ యువకులు రవి, మధు, రాజేంద్ర ప్రసాద్, హరికుమార్, శ్రీను రూ. 1700 ఖర్చుపెట్టి చింపాంజీ దుస్తులు కొనుగోలు చేశారు. రోజుకొకరు చింపాంజీ వేషంలో కోతులు తిరిగే చోట పహారా కాస్తుండటంతో, అవి భయపడి పారిపోతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా కోతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్