భూ సమస్యలకు రీ సర్వేతోనే పరిష్కారం..తాహసిల్దార్

5చూసినవారు
భూ సమస్యలకు రీ సర్వేతోనే పరిష్కారం..తాహసిల్దార్
కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలంలోని కొలిమికుంట గ్రామంలో మంగళవారం భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే ప్రాముఖ్యతపై తాహసిల్దార్ నవీన్ కుమార్ మాట్లాడారు. రీ సర్వే ద్వారా అన్ని భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ రావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ రమణయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రిపాల్ సింగ్, జిపిఓ వనిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్