నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: ఎమ్మెల్యే సత్యం

2చూసినవారు
నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: ఎమ్మెల్యే సత్యం
గత పదేళ్లలో చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, తాము అధికారంలోకి వచ్చాకే ఇక్కడ ప్రగతి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ లో అన్నారు. నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం అందిస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో కొండగట్టుకు ఒక్క రూపాయి నిధులు కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. నిధులు తెచ్చామని బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్