మ్యాడంపెల్లిలోని పాఠశాలలో నెలకొన్న ఇబ్బందులను ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ గాతం అంజయ్య, ఉప సర్పంచ్ కొక్కెర మల్లేష్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన సర్పంచ్, ఉప సర్పంచ్ సమస్యల పరిష్కారానికి కార్యచరణ రూపొందించి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాషావేణి అంజి కూడా పాల్గొన్నారు.