రౌడీ షీటర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని ఎస్పీ గౌస్ ఆలం పోలీస్ అధికారులను సూచించారు. ఈ సందర్భంగా రామడుగు పోలీస్ స్టేషన్ను బుదవారం తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను, పట్టుబడ్డ వాహనాలను, పెండింగ్ కేసులను పరిశీలించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ రూరల్ ఏసీపీ ప్రకాశ్, చొప్పదండి సీఐ ప్రదీప్, ఎస్సై రాజు ఉన్నారు.