సదర్ పండుగ" పశుపోషకుల ఆత్మగౌరవానికి ప్రతీక.

0చూసినవారు
సదర్ పండుగ" పశుపోషకుల ఆత్మగౌరవానికి ప్రతీక.
గంగాధర మండలం, మధురానగర్ గ్రామంలో శనివారం నగరపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన "సదర్" వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సామాజిక వేత్త తూడి లచ్చన్న, కొత్త జైపాల్ రెడ్డి, కోడూరి సత్యనారాయణలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సదర్ పండుగ" పశుపోషకుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఈ పండుగను సమాజం ఐక్యంగా జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను కాపాడటం అందరి బాధ్యత అని, ప్రభుత్వం పశుపోషకుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్