బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు ఆందోళన చెందుతుంటే, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షార్పితమై రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, మంత్రులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని విమర్శించారు.