కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగి, రోడ్లపైకి వరద నీరు చేరి, కుడి చెరువు సమీపంలోని పలు ఇళ్లలోకి ప్రవేశించింది. 30 ఏళ్ల నాటి డ్రైనేజీల సామర్థ్యం సరిపోకపోవడమే దీనికి కారణమని బాధితులు పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు. కౌన్సిలర్ల సమాచారంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టగా, త్వరలో కొత్త డ్రైనేజీలు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.