తెలంగాణ జాతిపిత కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బోయినపల్లి మండలం తడగోండ మాజీ సర్పంచ్ చిందము రమేష్ ఆరోపించారు. కేసీఆర్ ను టచ్ చేయడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని, స్వరాష్ట్ర కలను సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేతపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని ఆయన అన్నారు. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని రమేష్ విమర్శించారు.