కొడిమ్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

560చూసినవారు
కొడిమ్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
కొడిమ్యాల మండలం తుర్క కాశీనగర్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సెంటర్లపల్లి గ్రామానికి చెందిన బుచ్చిబాబు వేములవాడ మండలానికి చెందిన మారుతిలు పని నిమిత్తం కరీంనగర్ వైపు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల-కరీంనగర్ హైవేపై వెళ్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్