వన మహోత్సవం: చొప్పదండిలో మొక్కల పంపిణీ
కరీంనగర్ జిల్లా, చొప్పదండి మున్సిపల్ 13వ వార్డులో కౌన్సిలర్ జిట్ట మంగ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం వన మహోత్సవం సందర్భంగా మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ద్వారా వార్డును మరింత పచ్చగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దవచ్చని, మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస గంగయ్య గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.