బోయిన్‌పల్లిలో వినాయక నిమజ్జనం.. బతుకమ్మకు ఘన ఏర్పాట్లు

5చూసినవారు
బోయిన్‌పల్లిలో వినాయక నిమజ్జనం.. బతుకమ్మకు ఘన ఏర్పాట్లు
బోయిన్‌పల్లి మండలం దుండ్రపల్లి గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జనం, సద్దుల బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని చెరువు కట్టపై విద్యుత్ స్తంభాలు, లైటింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ జంగం అంజయ్య ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ ఏర్పాట్లు చేపట్టింది. పండుగల సందర్భంగా చెరువు కట్ట వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున రాత్రివేళ ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని సర్పంచ్ జంగం అంజయ్య పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్