బోయినపల్లి మానువాడ వద్దగల మిడ్ మానేర్ రిజర్వాయర్ నుండి ఉన్నతాధికారుల సూచనల మేరకు శనివారం మధ్యాహ్నం 2:00 గంటలకు దిగువకు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. దీనితో దిగువ గ్రామాలకు సంబంధించిన పోలీసు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా వారు గ్రామస్తులను అప్రమత్తం చేయాలని కోరడమైనది. అలాగే నదిలో ఉన్న మోటార్లను వీలైనంత త్వరగా తొలగించాలని సూచించారు.